దారుణం: మూడేళ్లుగా 44 మంది అత్యాచారం

-

కేరళలోని మల్లప్పురంలో ఓ మైనర్‌పై మూడేళ్లుగా 44 మంది అత్యారానికి పాల్పడ్డారు. సదరు బాలిక నిర్భయ కేంద్రంలో కౌన్సెలింగ్‌ ఇస్తున్న క్రమంలో ఈ విషయాలు బయటకు చెప్పింది. తాను పదమూడేళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి లైంగికదాడికి గురవుతూ వచ్చానని బోరుమంది. తనను కాపాడాల్సిన బంధువులు సైతం మూడేళ్లుగా తనపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారని తెలిపింది. 13– 14 సంవత్సరాలు ఉన్నప్పుడు తాను పలుసార్లు లైంగిక వేధింపులకు గురికావడంతో తనను చైల్డ్‌ హోంకు తరలించినట్లు పేర్కొంది. ఆ తర్వాత ఓ ఏడాదికి తన తల్లి వద్దకు వెళ్లడానికి అధికారులు అనుమతించగా అక్కడికి వెళ్లాను. అక్కడ ఉన్న బంధువుల చేతిలో సైతం అత్యాచారానికి గురైనట్లు బాధితురాలు పేర్కొంది.

20 మంది అరెస్ట్‌

ఆ బాధలు భరించని బా«ధితురాలు అక్కడి నుంచి పారిపోగా, పాలక్కడ్‌లో అధికారులు గుర్తించి గతేడాది డిసెంబర్‌లో నిర్భయ కేంద్రానికి తరలించారు. ఈ క్రమంలో అక్కడ కౌన్సెలింగ్‌ కేంద్రంలో సదరు బాలిక, అధికారుల ముందు తన గోడును వెళ్లగక్కింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటి వరకు 44 మందిపై కేసు నమోదు చేయగా, వారిలో ఇప్పటికే 20 మందిని అరెస్టు చేసినట్లు మలప్పురం ఎస్పీ మహ్మద్‌ హనీఫా పేర్కొన్నారు. 2015 నుంచి బా«ధితురాలు తన తల్లితో కలిసి మలప్పురంలోని ఓ చిన్న కాలనీలో నివసించేది. తల్లి ప్రతిరోజూ కూలీ పనునలకు వెళ్తుండేది. దీంతో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇదే అదనుగా భావించిన ఇరుగుపొరుగువారు బెదిరింపులకు పాల్పడి లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపారు. బాధితురాలు గుర్తుపట్టిన, పేర్లు చెప్పిన వారిపై కేసులు నమోదు చేశామని నిందితులపై పోక్సో చట్టం కొంద కేసు నమోదు చేశామని, త్వరితగతిలోనే మిగతా వారిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version