బ్రేకింగ్ : బీజేపీ లో చేరిన తీన్మార్ మ‌ల్ల‌న్న‌

-

భారతీయ జ‌నతా పార్టీ లో క్యూ న్యూస్ అధినేత‌, ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ తీన్మార్ మ‌ల్ల‌న్న చేరారు. కాసేప‌టి క్రిత‌మే.. జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్.. ఆధ్వ‌ర్యంలోనే… బీజేపీ పార్టీ లో చేరారు తీన్మార్ మ‌ల్ల‌న్న‌.

Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న

ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూ రావు, తది తరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భం గా బండి సంజ‌య్ మాట్లాడుతూ… తీన్మార్ మల్ల‌న్న బీజేపీ పార్టీ లో చేర‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ప‌ద‌వులు, సీట్ల కోసం బీజేపీ పార్టీలో తీన్మార్ మ‌ల్ల‌న్న చేర‌ లేద‌ని.. కేవ‌లం టీఆర్ ఎస్ పార్టీని తెలంగాణ లో అంత‌మొందించేందుకు చేరార‌ని తెలిపారు బండి సంజ‌య్‌. ప్ర‌జ‌ల కోసం తీన్మార్ మ‌ల్లన్న పోరాటం చేస్తున్న వ్య‌క్తి అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version