బాల నటుడుగా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా మారాడు తేజ. తనని తాను హీరోగా ప్రూవ్ చేసుకోవాలని అద్భుతమైన నటనతో ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. రీసెంట్గా తేజ హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా పెద్ద హిట్ అయింది చరిత్రలోనే ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డులని బద్దలు కొట్టే విధంగా సినిమాని తీసారు. దాదాపు 300 కోట్ల రూపాయలు ని వసూలు చేసింది ఈ సినిమా. నెల రోజులు దాటినా కూడా ఇంకా థియేటర్లలో ఈ మూవీ ఆడుతోంది.
50 రోజులు దగ్గర పడుతున్న ఈ సినిమా తేజకి మాత్రమే కాదు సినిమాలో పనిచేసిన అందరికీ కూడా మంచి పేరును తీసుకువచ్చింది. 300 కోట్ల సినిమాతో హిట్టు కొట్టాడు కనుక రెమ్యూనరేషన్ ని కూడా బాగా పెంచాడు. డబ్బులు ముఖ్యమే కాస్త పెంచి ఇస్తారు సరే కానీ కంటెంట్ ముఖ్యమని తేజ చెప్తున్నాడు. తన వద్దకి వచ్చిన అన్ని కథలను కాదనకుండా వింటూనే తనకి సెట్ కావు అనుకున్న వెంటనే సున్నితంగా రిజెక్ట్ చేస్తున్నాడు.