బీహార్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు గెలుపు ధృవీకరణ పత్రాలు ఇవ్వలేదని ప్రతిపక్ష పార్టీల ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. వారు చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవు అని ఎన్నికల కమిషన్ వర్గాలు శుక్రవారం తెలిపాయి. లెక్కింపు పూర్తిగా పారదర్శకంగా ఉందని, అన్ని రాజకీయ పార్టీల ముందు జరిగింది అని పేర్కొన్నాయి. అన్ని రాజకీయ పార్టీలకు రౌండ్ వారీగా నివేదికలు ఇచ్చామని చెప్పారు.
ఆ సమయంలో ఎటువంటి ఆరోపణలు రాలేదని ఎన్నికల సంఘం పేర్కొంది. తేజశ్వి యాదవ్ ఎన్నికల సంఘమపై మండిపడ్డారు. మంగళవారం, ఓట్లు లెక్కిస్తున్నా సమయంలో కోవిడ్-సంబంధిత ఆంక్షల కారణంగా 15 గంటలు పట్టింది అని ఎన్నికల సంఘం పేర్కొంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరియు అతని ప్రభుత్వం ఒత్తిడి కారణంగా తమ అభ్యర్థులకు విన్నింగ్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి.