ఫోటోలు : ఆ ఛాలెంజ్‌ చేపట్టిన బిగ్ బాస్ బ్యూటీ..!

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి మంచి స్పందనే వచ్చింది. ఇప్పటికే ఎంతో మంది సినీ తారలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు చాలా మంది ఈ ఛాలెంజ్‌ ను స్వీకరించారు.

తాజాగా.. ఈ ఛాలెంజ్ ను స్వీకరించారు బిగ్ బాస్ షో ఫేమ్ తేజస్వీ మదివాడ. ఇందులో భాగంగా శుక్రవారం నాడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తేజస్వి మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని రక్షించాలని కోరారు. అదేవిధంగా యువతీ యువకులను పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఈ యొక్క గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఇదేవిధంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఇంత మంచి కార్య‌క్ర‌మం చేప‌ట్టిన సంతోష్‌గారికి అభినంద‌న‌లు అని తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version