కరోనా టీకా పంపిణీకి సిద్దమైన తెలంగాణ ప్రభుత్వం

-

కరోనా టీకా పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం సిద్దమయింది. టీకా పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. టీకా పంపిణీకి రాష్ట్రస్థాయిలో టాక్స్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. జిల్లా , మండల స్థాయిలో వైద్య అధికారులతో కమిటీలను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. టీకా పంపిణీకి అధికారులకు రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. టీకా వేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తితే ఏవిధంగా వ్యవహరించాలనే దానిపై శిక్షణ ఇస్తున్నారు. మెదట జిల్లాస్థాయి అధికారులకు, తర్వాత మండల స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు.‌. వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీకా పంపిణీకి సైతం గుర్తింపు కార్డు తప్పనిసరి చేయనున్నారు.

ప్రతి టీకా పంపిణీ కేంద్రం వద్ద పోలీసులతో బందోబస్త్ నిర్వహించనున్నారు. సూది ద్వారానే అధికారులు టీకా పంపిణీ చేయనున్నారు. తొలి వారంలో సుమారు 70లక్షల మందికి టీకా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంపిక చేసిన వ్యక్తులకు మాడు నాలుగు వారాల వ్యవధిలో రెండు డోసుల పంపిణీ చేయనున్నారు. రోజుకు ఒక్కో బృందం వంద టీకాలు  వేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. ప్రభుతవ, ప్రైవేటు వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య, రవాణా కర్మికులకు ముందుగా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. కరోనా టీకా పంపిణీకి కోవిన్ సాఫ్ట్ వేరును రూపొందించిన అధికారులు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో వ్యాక్సిన్ నిల్వ ఉంచేందుకు జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ లో శీతల యంత్రాల ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version