Telangana :ట్రాఫిక్ క్ పెండింగ్ చలాన్ల చెల్లింపు ….మొరాయిస్తున్న సర్వర్లు….

-

ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులతో రూ.8.44 కోట్ల ఆదాయం లభించిందని ప్రభుత్వం వెల్లడించింది. హైదరాబాద్ పరిధిలో 3.54 లక్షల చలాన్ల ద్వారా ₹2.62 కోట్లు, సైబరాబాద్ పరిధిలో 1.82లక్షల చలాన్ల చెల్లింపు ద్వారా ₹1.80 కోట్లు, రాచకొండ పరిధిలో 93వేల చలాన్లకు ₹76.79 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.చెల్లింపుల తాకిడితో తరచూ సర్వర్ హ్యాంగ్ అవుతోంది.

పెండింగ్లో ఉన్న చలాన్లను వెంటనే చెల్లించేందుకు రాష్ట్రంలోని వాహనదారులకు పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే . వచ్చే జనవరి 10వ తేదీ వరకు చలాన్లు చెల్లించుకోవచ్చని ప్రకటన విడుదల చేసింది.

ఆటోలు, ఫోర్ వీలర్లకు 60 శాతం, టూ వీలర్లకు 80 శాతం, ఆర్టీసీ బస్సులు ,తోపుడుబండ్లపై 90% రాయితీ కల్పించింది. భారీ వాహనాల పై 50% రాయితీని కల్పించింది. రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉండడంతో ఈ మేరకు పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version