BREAKING : తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..ఇలా చెక్‌ చేసుకోండి

-

తెలంగాణ రాష్ట్రంలో నేడు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే అంటే.. ఇవాల ఉదయం 11.30 గంటలకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఫలితాలను విడుదల చేశారు. ఇక ఈ పదో తరగతి ఫలితాలలో 79.82 ఉత్తీర్ణతా శాతం నమోదు అయిందని ఈ సందర్భ్భంగా .. పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ప్రకటించారు.

బాలురు ఉత్తీర్ణత శాతం 78.42, బాలికల ఉత్తీర్ణత శాతం 82.21గా నమోదు అయిందని తెలిపారు. అలాగే.. ఈ ఫలితాలు ‌www.bse.telangana.gov.in వెబ్‌సైట్​లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఇక అటు పరీక్షల్లో ఫలితాలు అనుకూలంగా రాకపోయినా విద్యార్థులెవరూ ఆందోళన చెందొద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన చెప్పారు.

చదువొక్కటే జీవితం కాదని.. దానికి మించినవి చాలా ఉన్నాయని అన్నారు. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడటం వంటి పనులు చేయకూడదని సూచించారు. వచ్చే సంవత్సరం మళ్లీ కష్టపడి పరీక్షలు రాయొచ్చని.. కన్నవాళ్లకు గుండెకోత మిగల్చొద్దని కోరారు. విద్యార్థులంతా ధైర్యంగా ఉండి ఫలితాలు ఎలా ఉన్నా స్వీకరించేలా సన్నద్ధం కావాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version