నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాల్లో కరోనా వ్యాప్తి నివారణ, బాధితులకు అందుతున్న వైద్యం, భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టం, తీసుకోవాల్సిన చర్యలు, వ్యవసాయరంగం, పంట‌ల నియంత్రిత సాగు, కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ బిల్లుల విధానం, కొత్త‌రెవెన్యూ చ‌ట్టం చర్చించే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. అలాగే..ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో ఎస్టీ, మైనారిటీల రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ తదితర అంశాలపై అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌ధాన చ‌ర్చ జ‌రగ‌నుంది. సోమవారం ఉదయం 11 గంటలకు మొదలయ్యే సమావేశాల్లో తొలుత ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డికి నివాళులర్పిస్తారు.

అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో ఉభయ సభల నిర్వహణకు త‌గు జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన వారినే లోనికి అనుమతిస్తారు. సభలో ఒక సీట్లో ఒకరే కూర్చొనేలా.. అదనంగా అసెంబ్లీలో 40, మండలిలో 8 సీట్లు ర్పాటు చేశారు. అసెంబ్లీ ఆవరణలోని పలు ప్రాంతాల్లో శానిటైజర్‌ యంత్రాలు, ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి వచ్చే ఫైళ్ల‌ను శానిటైజ్‌ చేసేందుకు ప్రత్యేక యంత్రాలను అమర్చారు.

Read more RELATED
Recommended to you

Latest news