కేజ్రీవాల్ బాటలో కేసీఆర్..అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం ?

-

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ బాటలో.. సీఎం కేసీఆర్‌ వెళుతున్నారా.. ? ఆయన తరహాలో వెళ్లి.. బీజేపీ ఢీ కొట్టాలని యోచిస్తున్నారా… అంటే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే.. అవుననే అనిపిస్తుంది. ఢిల్లీ సీఎం రాజకీయ వ్యూహాన్ని ఫాలో అవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ ప్రభుత్వంలో కీలక మంత్రులపై అవినీతి, మనీ లాండరింగ్ ఆరోపణలు, బిజెపి ఆపరేషన్ లోటస్ నేపథ్యంలో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి తన బలాన్ని మరోసారి నిరూపించుకున్నారు.

కేంద్రం అనుసరిస్తున్న రాష్ట్రాల వ్యతిరేక విధానాలు, సిబిఐ, ఈడి, ఐటీలు వంటి విచారణ సంస్థలను తన జేబు సంస్థలు ఎలా మార్చుకొని ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై ఉసిగొల్పుతుందో అసెంబ్లీ సాక్షిగా ఏకిపారేశారు. అదే వ్యూహాన్ని తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టిఆర్ఎస్ నేతల పేర్లను ప్రచారం చేయడం, పదేపదే సిబిఐ, ఈడి, ఐటిలు సీఎం కుటుంబాన్ని విచారిస్తాయని కమలం పార్టీ నేతలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి కేంద్రంపై విమర్శలు చేయనున్నారు.

దాంతోపాటు తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల పేరుతో గొడవలు పెట్టడాన్ని తెలంగాణ ప్రభుత్వం తిప్పి కొట్టనుంది. నిత్యావసరాలపై జిఎస్టి అమలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలపై కేంద్రంపై కేసీఆర్ విమర్శలు చేయడానికి అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. బిజెపి దూకుడుకు కళ్లెం వేసేందుకు రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు, హైదరాబాద్ లో మత ఘర్షణలకు కొన్ని పార్టీల కుట్రలను అసెంబ్లీ వేదికగా కేసిఆర్ ఎక్స్ పోస్ చేయవచ్చు. తెలంగాణలో కేంద్ర మంత్రుల వరుస పర్యటనలు, వారి విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version