రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ… కొడంగల్ ప్రాజెక్టుపై NGT కీలక ఆదేశాలు

-

రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. కొడంగల్ ప్రాజెక్టుపై NGT కీలక ఆదేశాలు ఇచ్చింది. రేవంత్ రెడ్డి ప్రారంభించిన నారాయణపేట – కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.

National Green Tribunal orders Telangana government to stop Narayanpet-Kodangal lift irrigation project
National Green Tribunal orders Telangana government to stop Narayanpet-Kodangal lift irrigation project

ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చే వరకు ఎలాంటి పనులు చేపట్టరాదని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన ఎన్‌జీటీ… వెంటనే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపివేయాలని ఆదేశించింది. అయితే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపాలన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. దీనిపై.. మళ్లీ సమీక్ష నిర్వహించి.. ముందుకు వెళ్లే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో… ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ ప్రాజెక్టు కడుతున్నారని ఓ ప్రచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బ్రేక్ వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news