అమరావతి పాదయాత్ర మళ్ళీ మొదలు..మూడు రాజధానులు కూడా.!

-

అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని దాదాపు మూడేళ్ళ నుంచి ఆ ప్రాంత రైతులు, ప్రజలు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో రాజధాని మార్పు గురించి చెప్పని జగన్..అధికారంలోకి మూడు రాజధానులు అని మాట మార్చారని, ఎవరెన్ని చెప్పిన..అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి రైతులు పాదయాత్ర కూడా చేశారు. మొదట అమరావతి టూ తిరుపతి పాదయాత్ర చేశారు.

ఇక గత సెప్టెంబర్‌లో అమరావతి అరసవెల్లి(శ్రీకాకుళం) పాదయాత్ర మొదలుపెట్టారు. అయితే తూర్పు గోదావరి జిల్లాకు వచ్చాక..రామచంద్రాపురంలో పోలీసులతో రైతులకు వాగ్వాదం నడిచింది. పాదయాత్రకు భారీ స్థాయిలో టీడీపీ శ్రేణులు రావడంతో పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని సూచించారు. అందరూ గుర్తింపు కార్డులు చూపించాలని కోరారు.. ఆ తర్వాత పాదయాత్రను నిలిపి వేస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది.

తర్వాత పాదయాత్ర వ్యవహారం హైకోర్టుకు చేరింది. రైతులతో పాటూ ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేశారు. పాదయాత్రను నిలుపుదల చేయాలన్న ప్రభుత్వ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అలాగే పాదయాత్రలో 600 రైతులు మాత్రమే పాల్గొనాలని తేల్చి చెప్పింది.. వారు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కొట్టేసింది. ఐడీ కార్డులు ఉన్న రైతులే పాదయాత్ర చేయాలని సూచించారు. కానీ కొన్ని రోజుల పాటు రైతులు బ్రేక్ తీసుకున్నారు.

ఇక తాజాగా పాదయాత్ర మళ్ళీ మొదలుపెడుతున్నట్లు కొలికిపూడి శ్రీనివాసరావు తెలిపారు. ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి మొదలవుతుందని, నవంబర్ 28 తేదీ ఉదయం 8 గంటలకు మోదలవుతుందని చెప్పారు. అయితే అమరావతి పాదయాత్ర మొదలుకానున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు మళ్ళీ మూడు రాజధానుల నినాదం మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. మొన్న కూడా విశాఖ రాజధాని డిమాండ్‌తో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు చేశారు. అలాగే అమరావతి రైతులకు పాదయాత్ర దగ్గరకు వెళ్ళి నినాదాలు కూడా చేశారు. మరి ఈ సారి ఎలాంటి రచ్చ అవుతుందో చూడాలి.

ReplyForward

Read more RELATED
Recommended to you

Exit mobile version