తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. మూలధన వ్యవయం రూ.2,11,685 కోట్లు.. పెట్టుబడి వ్యయం రూ. 37, 525 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
‘తెలంగాణ ప్రారంభిస్తోంది.. దేశం ఆచరిస్తోంది. ఆర్థిక మాంద్యం, కరోనా సంక్షోభాలను తట్టుకుని రాష్ట్రం నిలబడింది. సంక్షోభ సమయాల్లో సమర్థంగా ఆర్థిక నిర్వహణతో మన్ననలు పొందింది. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది.’ అని హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.