BREAKING : దళితులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త..దళిత బంధుకు రూ. 17, 700 కోట్లు

-

BREAKING : దళితులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. దళిత బంధుకు ఏకంగా రూ. 17, 700 కోట్లను బడ్జెట్‌ లో ప్రవేశ పెట్టారు మంత్రి హరీష్‌ రావు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. మూలధన వ్యవయం రూ.2,11,685 కోట్లు.. పెట్టుబడి వ్యయం రూ. 37, 525 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.


బడ్జెట్‌ కేటాయింపులు

ఆసరా పింఛన్లు 12,000 కోట్లు

దళిత బంధు 17, 700 కోట్లు

బీసీ సంక్షేమం 6,229 కోట్లు

గిరిజన సంక్షేమం.. షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద 15, 233 కోట్లు

కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ 3,210 కోట్లు

బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు,

నీటి పారుదల రంగం 26, 885 కోట్లు,

విద్యుత్ రంగం 12, 727 కోట్లు

Read more RELATED
Recommended to you

Exit mobile version