తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కాబంధ హస్తాల్లో బంధీల ఉందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి వికారాబాద్ జిల్లాలోని పరిగిలో మన ఊరు – మన పోరు అనే సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఏనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలన లో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. నియమాకాల కోసం రాష్ట్రం అని చెప్పి.. కేసీఆర్ తమ కుటుంబంలో నియమాకాలు చేపట్టుకున్నాడని మండిపడ్డారు. ఈ ప్రాంతం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అభివృద్ధి కోసం చేశారో.. నిరుపించగలరా.. అని సవాల్ విసిరారు.
అలాగే అభివృద్ది కోసం టీఆర్ఎస్ లో చేరాం.. అని అంటున్న.. వాళ్లు ఎలాంటి అభివృద్ధి చేశారో రాష్ట్ర ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. చేవెళ్లకు ప్రాణహిత ప్రాజెక్టు రాకుండా అడ్డుకుంది.. సీఎం కేసీఆరే అని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో కేసీఆర్ కుమ్మక్కు అయి.. రాష్ట్రాన్ని నిండా ముంచారని మండిపడ్డారు. నీళ్లు, నిధుల, నియమాకాలు అర్థం మారిపోయిందని అన్నారు. నీళ్లు ఏపీకీ, నిధులు గుత్తే దారులకు, నియమాకాలు కేసీఆర్ కుటుంబానికి వెళ్లాయని ధ్వజమెత్తారు.