రికార్డ్ బ్రేక్ : తెలంగాణలో 24 గంటల్లో 920 కేసులు..!

-

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు మనుషులు. మరణాల సంఖ్య కూడా గమనీయంగా పెరుగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో గురువారం నాడు కొత్తగా 920 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,364కి చేరింది. రాష్ట్రంలో ఇవాళ కరోనాతో ఐదుగురు మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 230కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న మంది 4,688 డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 6,446 ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version