తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి జేఎన్టీయూహెచ్ లో ఫలితాలను విడుదల చేశారు. ఇప్పటికే ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్, అభ్యంతరాల ప్రక్రియ పూర్తయింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి ప్రతి ఏటా TS EAPCET పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నీట్ రాకముందు ఇదే పరీక్షను ఎంసెట్‌గా అభివర్ణించేవారు. ఇప్పుడు మెడికల్ లేకపోవడంతో ఈఏపీసెట్‌గా పిలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా EAPCET 2024 పరీక్షలు మే 9వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకూ జరిగాయి. మొత్తం 10 లక్షల 449 మంది హాజరు కాగా అందులో ఇంజనీరింగ్ పరీక్షకు 2,54,814 మంది హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను ఇవాళ http://eapcet.tsche.ac.inలో చెక్ చేసుకోవచ్చు.
అయితే AP EAPCET 2024 పరీక్షలు ఇవాళ్టి నుంచి 23వ తేదీ వరకూ జరగుగుతున్నాయి. ఎంపీసీ విభాగం పరీక్షలు 9 దశల్లో జరగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం, మద్యాహ్నం రెండు సెషన్లు ఉంటాయి. మే 16న బైపీసీ విభాగం పరీక్షలు ముగిశాయి.