మోడీ వ్యాఖ్యలపై సంచలన నిర్ణయం తీసుకు తెలంగాణ ఉద్యోగులు

-

మోడీ చేసిన వ్యాఖ్యల పై తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ మండిపడింది. నిన్న మోడీ చేసిన వ్యాఖ్యలను మేము కండిస్తున్నామని.. దశాబ్దాల కల నెరవేరింది అని ఎన్నడూ కూడా చులకన చేసి మాట్లాడలేదని టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఫైర్‌ అయ్యారు. కానీ నిన్న ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం తెలంగాణ ప్రజలను దూషించి మాట్లాడం సరికాదని.. ఏ ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదు,అనేక మంది తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశామని పేర్కొన్నారు.

ఆనాడు అనేక పోరాటాలు చేశాం.మిలియన్ మార్చ్ ,సకలజనుల సమ్మె చేశాం సాగర హారం చేశామని.. నిన్న రాజ్యసభలో మోడీ మాట్లాడని మాటలు మాకు బాధను కలిగించాయన్నారు. 8 సంవత్సరాలు గా మీరు అధికారంలో ఉన్నారు ఏమైంది మరి మీరు ఎం చేశారని.. ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు ఏమైయ్యాయని టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ నిప్పులు చెరిగారు.

తెలంగాణ ఉద్యోగుల విషయంలో ఎందుకు ఇంత వివక్ష…. ఎపి లో ఉన్న తెలంగాణ బిడ్డలను ఎందుకు తెలంగాణ కి తేవడం లేదన్నారు. అంతేకాదు… రేపటి నుండి అన్ని జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా నిరసనలు ఉంటాయని టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ కీలక ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version