కవల పిల్లల్లా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు .. బీజేపీ జాతీయనేత మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ ఏర్పాటు సమయంలో సరైన చర్చ జరగలేదని.. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టా అని ప్రశ్నించారు బీజేపీ జాతీయనేత మురళీధర్ రావు. కవల పిల్లల్లా టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నాయని అన్నారు. అనేక ప్రాణ త్యాగాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం. అటువంటి కాంగ్రెస్ పార్టీతో కూడా టీఆర్ఎస్ పార్టీ అంటకాగిందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు తగిన శాస్త్రి చేస్తారని అన్నారు. బీజేపీ కన్నా మించి అంకిత భావంతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పార్టీ ఏది లేదని ఆయన అన్నారు. మేము ముందు వరసలో ఉండి పోరాటం చేశామన్నారు. గతంలో కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయినప్పుడు బీజేపీ జాతీయ నాయకులు, నాయకత్వం ఎంతో సహకరించారని అన్నారు. ఏపీ విజభన చేసిన ప్రక్రియను, కాంగ్రెస్ పార్టీ పద్దతును విమర్శిస్తే తెలంగాణను అవమానిస్తున్నారంటూ..తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో బీజేపీ ఎదురించడం కోసం రీ అలైన్మెంట్ ప్రారంభం అయిందని.. ఇతర అనేక రాష్ట్రాల్లో బైపోలార్ రాజకీయాలు, రెండు రకాల రాజకీయాలు తెలంగాణలో ప్రారంభం అయ్యాయని అన్నారు. ఓ వైపు టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇంకో వైపు బీజేపీ పార్టీ ఇలా బైపోలార్ రాజకీయాలు ప్రారంభం అయ్యాయని అన్నారు. టీాఆర్ఎస్ కూటమికి బీజేపీకి మధ్య పోటీ ఉంటుందన్నారు మురళీధర్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version