తెలంగాణాలో ఇప్పుడు పులుల సందడి మొదలయింది. ఎటు నుంచి వస్తున్నాయి ఏ విధంగా వస్తున్నాయి అనేది తెలియకుండా అడవుల నుంచి పులులు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కి అతి దగ్గరగా ఉన్న జిల్లాల్లో పులులు ఎక్కువగా కనపడుతున్నాయి. దీనితో ఇప్పుడు ప్రజలు భయపడుతున్నారు. నిన్న నల్గొండ జిల్లాలో ఒక పులి చుక్కలు చూపించింది. అది ఉచ్చులో చిక్కుకుని తర్వాత పారిపోయింది.
ఆ తర్వాత అక్కడి నుంచి అది పారిపొయినా సరే మళ్ళీ జాగ్రత్తగా దానిని కట్టడి చేసారు. ఇక అది పక్కన పెడితే 20 రోజుల క్రితం హైదరాబాద్ లో ఒక పులి కనపడింది. గగన్ పహాడ్ వద్ద పులిని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అది రోడ్డు మీద ఒక లారీ డ్రైవర్ మీద కూడా దాడి చేసింది. అది ఎక్కడ తిరుగుతుందో తెలియదు. దాన్ని ఎం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితిలో అధికారులు ఉన్నారు.
మెదక్ జిల్లాలో రెండు చోట్ల పెద్ద పులులు కనపడుతున్నాయి. వాటిని పట్టుకోవడానికి గానూ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రంగా రెడ్డి జిల్లాలో కూడా పులి కనపడింది. ఇలా ఎక్కడ చూసినా సరే పులుల సంచారం బాగా ఇబ్బంది పెడుతుంది. అదే విధంగా మెదక్ జిల్లాలోని ఒక ప్రాంతంలో ఓపెన్ ఏరియాలో పులి కనపడింది. దీనితో ఇప్పుడు తెలంగాణా వాసులు వరుసగా పులులు బయటకు రావడంతో భయం భయంగా ఉంటున్నారు.