ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రికెట్ మ్యాచులు జరిగే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. ఇక మన దేశంలో క్రికెట్ అభిమానులు క్రికెట్ మ్యాచుల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ లు ఇప్పట్లో జరిగే అవకాశాలు మాత్రం కనపడటం లేదు అని అనుకున్నారు అందరూ. ఇక ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా సీరీస్ ని ఖరారు చేసారు. ఆస్ట్రేలియా వేదికగా ఈ మ్యాచులు జరుగుతాయి.
అక్టోబర్ నుండి టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటన మొదలు పెడుతుంది. ఈ పర్యటనలో మొత్తం మూడు మ్యాచ్‌ల టి 20 సిరీస్ తో పాటుగా నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ అలాగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఉంటుంది. టి 20 సిరీస్ అక్టోబర్ 11 న ప్రారంభం అవుతుందని టెస్ట్ సీరీస్ డిసెంబర్ 3 న మొదలవుతుందని వన్డే సిరీస్ జనవరి 12 న మొదలవుతుందని ఆస్ట్రేలియా పేర్కొంది.
ఒకసారి ఈ షెడ్యుల్ చూస్తే…
తొలి టీ 20 మ్యాచ్ అక్టోబర్ 11 న బ్రిస్బేన్‌లో రెండవ టి 20 కాన్బెర్రాలో 14, మూడవ టి 20 అడిలైడ్‌లో అక్టోబర్ 17 న జరగనుంది.
మొదటి టెస్ట్ బ్రిస్బేన్‌లో డిసెంబర్ 3 న, రెండవ టెస్ట్ డిసెంబర్ 11 నుండి అడిలైడ్‌లో, మూడవ టెస్ట్ డిసెంబర్ 26 నుండి మెల్బోర్న్ లో చివరి టెస్ట్ టెస్ట్ మ్యాచ్ జనవరి 3 సిడ్నీలో జరుగుతుంది.
తొలి వన్డే మ్యాచ్ జనవరి 12 న పెర్త్‌లో, రెండవ వన్డే జనవరి 15 నుండి మెల్బోర్న్ లో, మూడవ వన్డే జనవరి 17 న సిడ్నీలో జరుగుతుంది