తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉదయం ఇంటర్ మీడియట్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్షల్లో పాస్ అయిన వారందరూ తమ తమ భవిష్యత్తు ప్రణాళికలలో మునిగిపోగా, ఫెయిల్ అయినవారు మాత్రం తమ జీవితాలు ఇక్కడితో ఆగిపోయాయని బాధలో ఉన్నారు. కాగా కొందరు విద్యార్థులు ఫెయిల్ అయినా దైర్యం గా సప్లమెంటరీ పరీక్షల తేదీలను తెలుసుకుని మళ్ళీ చదువులో పడిపోయారు. కానీ ఫెయిల్ అయినవారిలో మనోధైర్యం తక్కువ ఉన్నవారు.. ఇంట్లో సరిగ్గా వారి గురించి పట్టించుకోని వారు మాత్రమే ఇక మా జీవితాలు అయిపోయాయి అని నిర్ణయించుకుని తమ ప్రాణాలను తీసుకున్నారు.