కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ మరో లేఖ

-

కృష్ణా బోర్డు చైర్మన్ కు లేఖ రాసింది తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ఈఎన్సీ మురళిధర. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు విస్తరణ లో భాగంగా రెండో దశ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 680 కోట్ల తో జిల్లేడు బండ జలాశయాం నిర్మాణాని కి పరిపాలనా అనుమతిని ఇచ్చి టెండర్లు పిలవాడానికి సిద్దం అయ్యిందని లేఖలో పేర్కొంది తెలంగాణ సర్కార్.

గతం లో GNSS ప్రాజెక్టు విస్తరణ ను అనుమతించ వద్దని కే‌ఆర్‌ఎం‌బి కు లేఖలు రాసిన సంగతిని గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏ‌పి ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండానే జి‌ఎన్‌ఎస్‌ఎస్ విస్తరణ పనులు చేపడుతున్నదని లేఖలో వెల్లడించింది. వెంటనే ఈ పనులను ఆపాలని కోరుతూ కే‌ఆర్‌ఎం‌బి ఛైర్మన్ కు తెలంగాణ ఈ‌ఎన్‌సి మురళిధర లేఖలో విన్న విన్నవించారు.

కాగా గత కొద్ది రోజులుగా.. రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ల మధ్య జల వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కృష్ణా నది వాటా విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. కేంద్రం దిగి వచ్చినా కూడా ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఏ మాత్రం తగ్గటం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version