సిద్దిపేట : ధరణి పోర్టల్ సమస్యలపై తుది కసరత్తు, పరిష్కారాల అధ్యయనంపై చీఫ్ సెక్రటరీ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్, రాష్ట్ర ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్ రావు సుదీర్ఘ చర్చ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పేర్లలో తప్పులు దొర్లడం, విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు నమోదు కావడం, సర్వే నంబర్లలో పార్టుల సంబంధిత వివరాల్లో తేడాలు ప్రధాన సమస్యలు రైతులు ఎదురుకొంటున్నారు.
ఈ సమస్యల పరిష్కారం పై మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు అయింది. ధరణి పోర్టల్లో ఉన్న లోపాలపై అధ్యయనం చేస్తున్న మంత్రివర్గ ఉప సంఘం.. రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి పరిష్కారాలపై కసరత్తు చేసి పోర్టల్లో కొత్త మాడ్యూల్స్ ప్రవేశ పెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దింతో క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే అంశాలపై ఇవాళ చర్చ జరుగుతోంది. టెక్నీకల్ గా ఎదుర్కొంటున్న అంశాలపై కూలంకషంగా అధికారులతో సుదీర్ఘంగా చర్చ జరిపిన హరీష్ రావు.. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ఉత్పన్నమయ్యే పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.