ట్రాన్స్ జెండర్లకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త

-

ట్రాన్స్ జెండర్లకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త చెప్పింది. ట్రాన్స్ జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గారు అన్నారు. వైద్యం, ఉపాధి, ఇతర అవకాశాల విషయంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని, ఈ విషయంలో ట్రాన్స్ జండర్లు అన్ని విధాలా అర్హులని చెప్పారు.

గురువారం MCRHRD లో ఎస్సీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్వర్యంలో మంత్రి హరీశ్ రావు ను ట్రాన్స్ జెండర్లు కలిసి వారి సమస్యల గురించి వివరించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు అధ్యయనం చేసి, రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్ల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకొని నివేదిక అందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్ ను ఆదేశించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నివేదించి, కేబినెట్ ద్వారా ట్రాన్స్ జెండర్లకు ఆరోగ్యం, విద్య, ఉపాధి, ఇతర సంక్షేమ పథకాల్లో ప్రయోజనం చేకూర్చేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో TSMSIDC చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఇ రమేష్ రెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version