తెలంగాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం…!

-

తెలంగాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జ్వరం వచ్చిన వాళ్ళు అందరికి కూడా కరోనా టెస్టులు చెయ్యాలని తెలంగాణా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణాలో ఇప్పుడు కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అవి ఇప్పుడు అదుపులోనే ఉన్నా మరింతగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఇళ్ళకు వెళ్ళిపోయారు.

వారి కారణంగానే ఇప్పుడు కరోన ఎక్కువగా వస్తుంది. దీనితో జ్వరం ఉన్న వాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండాలని కరోనా పరిక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫీవర్ సర్వైలేన్స్ రాష్ట్రంగా తెలంగాణాను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణాలో 36 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులలో ఏ ఒకరికి ప్రాణాపాయం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా పాజిటివ్ వచ్చింది.

జర్మని, లండన్, సౌదీ నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. వాళ్ళు అందరూ 50 ఏళ్ళు పైబడిన వారే ఉన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా తెలంగాణా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెల్సిందే.ప్రస్తుతం తెలంగాణాలో ఎవరూ కూడా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోలేదు. విదేశాల నుంచి వచ్చిన వారికి పరిక్షలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version