కేఆర్ఎంబీకి తెలంగాణ ప్ర‌భుత్వం లేఖ‌.. 13 ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌పై ఫిర్యాదు

-

కృష్ణా న‌ది యాజ‌మాన్య బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మరో లేఖ రాసింది. గ‌త కొద్ది రోజుల ముందే రాయ‌ల‌సీమ‌కు కృష్ణా న‌ది జ‌లాల‌ను త‌ర‌లించే ఎత్తిపోత‌ల ప్రాజెక్టు ప‌నుల విస్త‌ర‌ణ ఆపాల‌ని కృష్ణా న‌ది యాజ‌మాన్య బోర్డుకు తెలంగాఇణ రాష్ట్ర ప్ర‌భుత్వం లేఖ రాసింది. తాజా గా రాసిన మ‌రో లేఖ‌లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉన్న 13 ఎత్తిపోత‌ల పథ‌కాల‌పై కృష్ణా న‌ది యాజ‌మాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. గురు రాఘ‌వేంద్ర సహా 13 ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌పై కృష్ణా న‌ది యాజ‌మాన్య బోర్డుకు తెలంగాణ నీటి పారుద‌ల శాఖ ఈఎన్‌సీ ముర‌ళీధ‌ర్ ఫిర్యాదు చేస్తు లేఖ రాశారు.

ఎలాంటి అనుమ‌తులు లేకుండా.. ఆర్టీఎస్ దిగువ నుంచి సుంకేశుల వ‌ర‌కు ఎత్తిపోతల ప‌థ‌కాల‌ను చేప‌ట్టార‌ని లేఖలో ఫిర్యాదు చేశారు. ఈ ఎత్తిపోత‌ల పథకాల‌కు తుంగ‌భ‌ద్ర జ‌లాలు వాడుకోకుండా.. చూడాల‌ని బోర్డును తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కోరింది. అలాగే ఇప్పటి వ‌ర‌కు వాడుకున్న నీటిని ఏపీ ఖాతాలోనే జ‌మ చేయాల‌ని కోరారు.

అలాగే మరోక లేఖ‌లో ఆర్టీఎస్ కు సంబంధించి అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని అధ్య‌యనం చేయాల‌ని బోర్డును రాష్ట్ర ఈఎన్‌సీ కోరింది. హెడ్ రెగ్యులేట‌ర్, రాజ‌లి వాగు మ‌ధ్య పూడిక‌, ఇసుక ను పూర్తిగా తొల‌గించే వ‌ర‌కు అధ్య‌యానం చేయాల‌ని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version