తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రిజర్వాయర్ కాంట్రాక్టు రద్దు..!

-

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్టు రద్దు చేస్తూ.. బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ రిజర్వాయర్ గోదావరి నది ఫేజ్-2లో భాగంగా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో కేవవాపురం రిజర్వాయర్ ను నిర్మించాలని చూసింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ రిజర్వాయర్ పనులు ప్రారంభం కాలేదు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభమై పనులు కొనసాగుతున్న ప్రాజెక్టులను మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెఘా ఇంజనీరింగ్ విభాగం జీవో ని జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కేశవాపురం రిజర్వాయర్ అందులో భాగంగా చేపట్టే పనులకు అయ్యే రూ.2వేల కోట్ల ఖర్చు ఆదా కానున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version