హైడ్రాతో పడిపోయింది రియల్ ఎస్టేట్ కాదు.. బీఆర్ఎస్ గ్రాఫ్ : సామ రామ్మోహన్ రెడ్డి

-

హైడ్రాతో పడిపోయింది నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని.. బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ మాత్రమేనని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై చేసిన ఆరోపణలను తిప్పికొట్టా సామ రామ్మోహన్ రెడ్డి. కేటీఆర్ పథకం ప్రకారమే.. రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేరుతో మీటింగ్ పెట్టారని విమర్శించారు. ముక్కు ముఖం తెలియని వారు రియల్టర్లు అని చెబుతున్నారని.. గత సంవత్సరం పుట్టిన రియల్ ఎస్టేట్ సంఘం ఇదని.. పార్టీ నేతలను కలుపుకొని రియల్ ఎస్టేట్ మీటింగ్ అని కలరింగ్ ఇచ్చారని విమర్శించారు.

గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రిజిస్ట్రేషన్లు పెరిగాయని తెలిపారు. హైడ్రా చెరువు కబ్జాలను అడ్డుకుంటే రియల్ ఎస్టేట్ పడిపోతుందా..? అని ప్రశ్నించారు. హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోలేదని.. బీఆర్ఎస్ నాయకుల రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. హైడ్రా వచ్చిన తరువాత కూడా హైదరాబాద్ లో నెల నెల రిజిస్ట్రేషన్లు పెరిగిన మాట వాస్తవమన్నారు. తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ తెలంగాణను దోచుకున్నాడని మండిపడ్డారు సామ రామ్మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version