తెలంగాణాలో వర్షాల వల్ల, వరదల వల్ల సర్టిఫికెట్స్ కోల్పోయిన విద్యార్థులకు ఫ్రెష్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్టిఫికెట్ కోల్పోయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఎలాంటి రుసుము తీసుకోకుండా ఫ్రెష్ / డూప్లికేట్ సర్టిఫికెట్ లు జారీ చేయాలని పాఠశాల, ఇంటర్, సాంకేతిక, ఉన్నత విద్య శాఖ కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సర్టిఫికెట్స్ పోయాయని, డామేజ్ అయ్యాయని పేరెంట్స్, అలానే విద్యార్థుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక మరో పక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రములో దసరా వరకు అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు తెలంగాణా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్ లకి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామ చంద్రన్ లేఖ రాశారు. రేపటి నుండి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.