వారి మాటే నెగ్గింది.. ఏకంగా ముగ్గురు కలెక్టర్ల బదిలీ !

-

దుబ్బాక ఉపఎన్నికల ఎఫెక్ట్ తో తెలంగాణాలో ముగ్గురు కలెక్టర్ లు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఉన్న కలెక్టర్ తెలంగాణా అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నారని, ఆయన అధికార పార్టీ గెలుపు కోసం పని చేస్తున్నాడని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఒకరిద్దరయితే ఏకంగా ఎన్నికల కమిషన్ కే లేఖలు రాశారు కూడా.

మరి ఎన్నికల కమిషన్ ఆదేశించిందో ? లేక ప్రభుత్వమే నిర్ణయం తీసుకుందో కానీ ప్రస్తుతం ముగ్గురు కలెక్టర్ లను బదిలీ చేసింది. సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న వెంకట్రామి రెడ్డి సంగారెడ్డి కి బదిలీ చేయగా సంగా రెడ్డి కలెక్టర్ గా ఉన్న హనుమంతరావు మెదక్ కి బదిలీ చేశారు. అయితే సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మెదక్ కలెక్టర్ గా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. మెదక్ కలెక్టర్ గా పని చేసిన ధర్మారెడ్డి గత జూలై లో రిటైర్ అయ్యారు. అప్పటి నుండి కొత్త కలెక్టర్ ని ఇంకా నియమించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version