ఉత్తరకొరియాలో హైఅలర్ట్..ఇళ్ల నుంచి బయటికి వస్తే..కిమ్ వార్నింగ్.

-

మరోసారి ఉత్తకొరియా దేశంలో హైఅలర్ట్ ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు కిమ్..ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావోద్దు అంటూ ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు..కరోనాను విజయవంతంగా నిరవారణ చర్యలు చేపట్టిన ఉత్తరకొరియా..ఇప్పుడు చైనా నుంచి వస్తోన్న ఎల్లో డస్ట్‌తో ఉత్తర కొరియా వణికిపోతోంది..దేశవ్యాప్తంగా అలర్ట్‌ ప్రకటించడంతోపాటు, నిర్మాణ పనులపై నిషేధం విధించింది..ఎల్ల డస్ట్ ద్వారా ఉత్తర కొరియాలోకి కరోనా వైరస్‌ వ్యాపిస్తుందనే భయంతోనే ప్రభుత్వం ఈచర్యలు చేపట్టినట్లు ప్రకటించింది..ఎల్లో డస్ట్‌ ద్వారా ప్రాణాంతక వైరస్‌ దేశంలోకి ప్రవేశించడం వల్ల కలిగే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టాలని అక్కడి అధికారిక దినపత్రిక రొడొంసిన్‌మన్‌ విజ్ఞప్తిచేసింది..

ప్రతి సంవత్సరం, చైనీస్ మరియు మంగోలియన్ ఎడారుల నుండి ఉత్తర మరియు దక్షిణ కొరియాలోకి ఎల్లో ధూళి డస్ట్‌ మేఘాల రూపంలో వీస్తుంటాయి..పారిశ్రామిక కాలుష్యకారకాలు మరియు ఇతర విష పదార్థాలను దానితో పాటు తీసుకువెళతాయని..ఈ సంవత్సరం కూడా, అనారోగ్య ఇసుక కణాలు వాతావరణం ద్వారా కొరియన్‌ దేశాలకు చేరుకుంటాయని భావించారు.

దీంతో ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, కిటికీలు క్లోజ్ చేసుకోవాలని అధికారిక మీడియా, కొరియన్‌ సెంట్రల్‌ ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది..తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులు ధరించాలని సూచించింది. చైనా నుంచి ఎల్లో డస్ట్’‌ వల్ల కరోనా వైరస్‌ మరింత విజృంభించవచ్చని ఉ.కొరియన్‌ అధికారుల తెలిపారు..వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా సీడీసీ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎల్లోడస్ట్‌ను కూడా తీవ్రంగా పరిగణించాలి. అందుచేత ఎల్లోడస్ట్‌ వల్ల కలిగే నష్టాలను నివారించడంలో భాగంగా వైరస్‌ కొరియాలోకి ప్రవేశించకుండా నిరోధించడమే ఇప్పుడు ముఖ్యమని రొడొంగ్‌ సిన్‌మన్‌ వ్యాఖ్యానించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version