దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు తీర్పు ఆపాలన్న ప్రభుత్వ పిటిషన్‌పై విచారణకు ఉన్నత న్యాయస్థానం సీజే నిరాకరించారు. సింగిల్ జడ్జి వద్ద విచారణకు అనుమతి ఇవ్వాలని ఏజీ బీఎస్ ప్రసాద్ సీజేను కోరిన విషయం తెలిసిందే. ధర్మాసనం విచారణ తర్వాత సింగిల్ జడ్జి విచారణ జరపలేరని సీజే తెలిపారు.
కేసు ఫైళ్ల కోసం సీబీఐ ఒత్తిడి చేస్తోందని.. కేసు ఫైళ్లు ఇవ్వాలని సీఎస్‌కు నిన్న మరోసారి సీబీఐ లేఖ రాసిందన్న అడ్వకేట్ జనరల్ ప్రసాద్ కోర్టుకు వివరించారు. డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చాక మళ్లీ సింగిల్ జడ్జి విచారణ జరపరాదని సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ స్పష్టం చేశారు. డివిజన్ బెంచ్ తీర్పును సుప్రీంకోర్టు మాత్రమే సమీక్షిస్తుందని తెలిపారు.