తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిర్ణీత సమయంలో ఎన్నికలు జరుపుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని ఇటీవల వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వాటిని కొట్టివేసింది. ఈ ఎన్నికలను ఆగస్టు 15లోపే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ, తెలంగాణలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.
మరోవైపు, నూతన వార్డుల విభజన, జనాభా ప్రక్రియపై ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని కూడా పిటిషనర్లు తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా ఏకపక్షంగా ప్రక్రియను పూర్తి చేశారని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు మున్సిపాలిటీల్లో ఎన్నికలపై స్టే విధించింది.