తెలంగాణాలో కరోనా పరిస్థితికి సంబంధించి అత్యవసర విచారణ చేపట్టిన తెలంగాణా హైకోర్ట్ విచారణలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అంబులెన్స్ లను అడ్డుకోవడానికి వీలు లేదని విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. అదే విధంగా రేపటి నుంచి వాక్సినేషన్ ఆపవద్దని వాక్సినేషన్ రెండో డోస్ ఇవ్వాల్సిన వాళ్ళు అందరికి కూడా ఇవ్వాల్సిందే అని స్పష్టం చేసింది.
లాక్ డౌన్ ఇంత సడెన్ గా ప్రకటిస్తే ఎలా అంటూ వ్యాఖ్యానించిన హైకోర్ట్… గత ఏడాది మాదిరిగా వలస కార్మికులు ఇబ్బంది పడవద్దని స్పష్టం చేసింది. రోజు వారీ కూలీల కోసం, వలస కార్మికుల కోసం ఏ విధమైన చర్యలు తీసుకున్నారని హైకోర్ట్ ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఇక రేపటి నుంచి తెలంగాణాలో లాక్ డౌన్ అమలు చేయనున్నారు.