వినాయక నిమజ్జనం పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

-

వినాయక నిమజ్జనం పై ఇవాళ విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌సాగర్‌ లో వినాయక నిమజ్జనం పై హైకోర్టు విచారణ చేపట్టింది. హుస్సేన్ సాగర్​లో నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిటిషన్ ​పై హైకోర్టు లో విచారణ జరిగింది. నిమజ్జనం సందర్భం గా ఆంక్షలు, నియంత్రణ చర్యలు సూచించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం, గణేష్ ఉత్సవ సమితి, పిటిషనర్ నివేదికలు సమర్పించాలని పేర్కొన్న హై కోర్టు.. కొవిడ్ పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఆదేశించింది. ప్రజల సెంటిమెంట్​ ను గౌరవిస్తూనే.. ప్రస్తుత పరిస్తితులు కూడా చూడాలని తెలంగాణ హై కోర్టు పేర్కొంది. ఎక్కడికక్కడ స్థానికంగానే నిమజ్జనం చేస్తే బాగుంటుందన్న హైకోర్టు.. సామూహిక నిమజ్జనం తో హుస్సేన్ సాగర్ దెబ్బతినకుండా చూడాలని ఆదేశించింది. అందరి సూచనలు పరిగణన లోకి తీసుకొని ఈ నెల 6 న తగిన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది హై కోర్టు

Read more RELATED
Recommended to you

Exit mobile version