డిసెంబర్ 09న తెలంగాణ తల్లి ఉత్సవాలను నిర్వహిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

-

పదేళ్ల సుదీర్ఘ కాలం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 63 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన పార్టీగా దేశం అంతటా తెలిసేలా తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎన్నికల కోడ్ ఉండటంతో స్వేచ్ఛగా ఉత్సవాలను స్వేచ్ఛగా నిర్వహించ లేదనే భావనతో ఉన్న ప్రభుత్వం డిసెంబర్ 9న అంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సచివాలయంలోని అన్ని కార్యాలయాల్లో తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఇక అదేరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నామని స్పష్టం చేశారు. అయితే, ఉత్సవాలకు సోనియాగాంధీని ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. ఇక సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇక నంచి ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్  రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news