ఏపీలో టీడీపీ విజయం పై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి తిరుగులేని విజయాన్ని అందుకుంది తెలుగుదేశం పార్టీ.. 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు మినహా రాష్ట్రంలోని మిగతా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను మొత్తం కైవసం చేసుకుంది కూటమి..ఇక, ఈ అద్భుత విజయాన్ని అందించిన ఏపీ ప్రజలకు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించడం పై టీడీపీ అధినేత చంద్రబాబుకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చంద్రబాబుకు అభినందనలు చెప్పారు. ఏపీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడికి కంగ్రాట్స్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. జూ.ఎన్టీఆర్ కూడా ట్వీట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news