రైతు చట్టాలపై మోడీ క్షమాపణ చెప్పినప్పుడే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందని.. మోదీకి ప్రధానిగా కొనసాగే హక్కు లేదని విమర్శించారు మోత్కుపల్లి నర్సింహులు. సీఎం కేసీఆర్ ఏమన్నాడని ప్రతిపక్షాలు బట్టలు చింపుకుంటున్నాయని విమర్శించారు. విభజన హామీలు ఎటు పోయాయని..ఒక్క హామీ కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో హామీల ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళిత బంధు ఇస్తున్న సీఎం కేసీఆర్ ని తిడుతుంటే మీరు ఇంత దుర్మార్గమైన మనుషులో అర్థం అవుతుందని అన్నారు. వచ్చే బడ్జెట్ లో దళిత బందు కోసం రూ. 20 వేల కోట్లు పెడుతున్నామని మోత్కుపల్లి అన్నారు. స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లుగా మాకు సుఖం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాజ్ పేయ్ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ మార్పు కోసం కమిటీ వేసింది మీరు కాదా.. అని బీజేపీని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మీద మాట్లాడే ఏ వ్యక్తి అయిన సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మోత్కుపల్లి హెచ్చరించారు. బీజేపీ పార్టీకి జై భీం అనే పదం మాట్లాడనికి మీకు హక్కు లేదు…అంబేద్కర్ ను తాకే హక్కు లేదని విమర్శించారు.