యాసంగి ధాన్యం సేకరణ యాక్షన్ ప్లాన్ రూపకల్పన పై అడిషనల్ కలెక్టర్లు, డిసిఎస్ఓలు, డీఎంలు, ఎఫ్సీఐ ఉన్నతాధికారులతో మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే తెలంగాణను ప్రోత్సహించాలన్నారు. తెలంగాణ ఏర్పాటు నుండి 672 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రైతులకు 1.21 కోట్ల కోట్లను అందించామన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు అనుకూల విధానాలతోనే దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ నిలిచిందన్నారు గంగుల కమలాకర్. యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిందన్నారు. అవసరమైన కొనుగోలు కేంద్రాల గుర్తింపు, జియో టాగింగ్, ట్రాన్స్పోర్ట్, మిల్లర్ల అనుసంధానం గన్నీలు, ప్యాడి క్లీనర్లు, మాయిశ్చర్ మిషన్లు, టార్పాలిన్ లపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. రైతులు ఖచ్చితమైన ఎఫ్ఏక్యూ ఇచ్చేలా అన్ని వసతులు కల్పించాలన్నారు. సంపూర్ణ వివరాలతో ముఖ్యమంత్రి కి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు మంత్రి గంగుల కమలాకర్.