ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఇంటి చిట్కాలని ట్రై చేస్తూ ఉంటారు. మీరు కూడా అందంగా ఉండాలని అనుకుంటున్నారా..? అందంగా కాంతివంతంగా మార్చుకోవాలని అనుకుంటున్నారా అయితే ఈ పండ్లతో సాధ్యం. ఈ పండ్లతో మరింత అందంగా మీరు మారచ్చు. పైగా ఈ పండ్ల వల్ల ఆరోగ్యం కూడా.
నిజానికి మనం పండ్లు కూరగాయలను డైట్లో తీసుకుంటూ ఉంటే అందం మరింత పెరుగుతుంది అలానే ఆరోగ్యం కూడా. యవ్వనంగా కనబడటానికి కూడా పండ్లు మనకి సహాయపడతాయి ఇక మరి ఏ పండ్లతో అందంగా మారచ్చు అనేది చూసేద్దాం.
దానిమ్మ:
ఆరోగ్యానికి దానిమ్మ ఎంతో మంచిది. చర్మం పై ఫైన్ లైన్స్ ముడతలు వంటివి ఏర్పడకుండా చూస్తాయి. తగ్గిస్తాయి. పైగా చర్మం మెరుస్తుంది కూడా.
ఆపిల్:
ఆపిల్ కూడా ఆరోగ్యానికి మంచిది. అందంగా యవ్వనంగా కనపడడానికి ఇది హెల్ప్ చేస్తుంది రోజు ఆపిల్ తిన్నా కూడా ప్రయోజనమే నష్టం ఏమీ ఉండదు.
ద్రాక్ష:
విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి చర్మాన్ని ఉత్తేజ పరుస్తుంది ద్రాక్ష. అలానే ద్రాక్ష ని తీసుకోవడం వలన యువి కిరణాల నుండి ప్రొటెక్షన్ మీకు అందుతుంది.
కివి:
కివి కూడా ఆరోగ్యానికి మంచిది చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది. కివిని తీసుకుంటే చర్మం పై నల్ల మచ్చలు ముడతలు వంటివి తొలగిపోతాయి.
పుచ్చకాయ:
పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అలానే పోషకాలు కూడా ఉంటాయి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది పుచ్చకాయ. అలానే చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది.
ఆరెంజ్:
విటమిన్స్ ఇందులో ఎక్కువగా ఉంటుంది చర్మాన్ని అందంగా మార్చేందుకు సహాయపడుతుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి.
నిమ్మకాయ:
నిమ్మకాయలో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. నిమ్మరసం తీసుకుంటే చర్మం పై నల్ల మచ్చలు తొలగిపోతాయి హైపర్ పిగ్మెంటేషన్ వంటి సమస్యలు కూడా ఉండవు.
మామిడి:
మామిడిలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి విటమిన్ కే కూడా ఉంటాయి వీటిని తీసుకుంటే చర్మం మెరుస్తుంది.