ఎన్నో ఆశలు.. మరెన్నో ఆశయాలు.. గొడవలు.. ఉద్యమాలు.. మారణ హోమాలు.. కన్నీటి గాథలు.. 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష తెలంగాణా రాష్ట్రం. కె.సి.ఆర్ నాయకత్వంలో ఎన్నో పోరాటాలతో సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. 2014లో ఉద్యమ పార్టీగా.. తెలంగాణా తెచ్చిన పార్టీగా బరిలో దిగిన టి.ఆర్.ఎస్ అప్పుడు ఏకగ్రీవంగా ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంది.
తెలంగాణా ప్రజల బాగుకోసం ఎన్నో అభివృద్ధి పథకాలతో బంగారు తెలంగాణా సాధనకై సిఎం చంద్రశేఖర్ రావు పడిన కష్టం అందరికి తెలిసిందే. నీరు సమస్య తీర్చే మిషన్ కాకతీయ, 24 గంటల కరెంట్, డబుల్ బెడ్ రూం ఇల్లు, కళ్యాణ్ లక్ష్మి పథకం ఇలా ఒకటేంటి మెనిఫెస్టోలో లేనివి కూడా కె.సి.ఆర్ చేసి చూపించారు.
అందుకే ఆయనకే తెలంగాణా ప్రజలు పట్టం కట్టారు. నాలుగున్నర ఏళ్లలో తెలంగాణాకు కె.సి.ఆర్ ఏం చేశాడో ఈరోజు వెళ్లడైన ఫలితాలను చూస్తే అర్ధమవుతుంది. 119 స్థానాల్లో 88 స్థానాలను గెలుచుకుని తెలంగాణా అంతా గులాబి రంగుమయం చేశారు కె.సి.ఆర్. ఇక సాకారం చేయాల్సిన కలలను ఇంకా అద్భుతమైన పనితీరుతో తెలంగాణా ప్రజల ఆకాంక్ష అయిన బంగారు తెలంగాణాకు బాటలు వేయాలని.. వేస్తారని.. మనలోకం.కామ్ తరపున టిఆర్ఎస్ అధినేత కె.సి.ఆర్ గారికి శుభాభివందనాలు.