పోడు రైతులకు గుడ్‌న్యూస్.. నెలాఖరులో పట్టాల పంపిణీ |

-

పోడు రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరు నుంచి పోడు భూముల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. అటవీహక్కుల చట్టం-2005 కింద రెండోవిడత లబ్ధిదారులకు పోడు పట్టాల పంపిణీకి ఇప్పటికే కసరత్తు ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభించనుంది.

ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో పోడు పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేసిన అనంతరం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. రెండో విడతలో 4 లక్షల ఎకరాల్లో 1.55 లక్షల మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇంతవరకు 1.26 లక్షల మంది లబ్ధిదారులకు సంబంధించిన పత్రాలను ముద్రించింది. మిగతావి ఈ నెలాఖరు నాటికి ప్రభుత్వం పూర్తి చేయనుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని మహబూబాబాద్‌ నుంచి పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతానికి గిరిజనులకు సంబంధించి క్లెయిమ్‌ల పరిశీలన చేపట్టిన ప్రభుత్వం.. అటవీహక్కుల చట్టం కింద సరైన ఆధారాలు సమర్పించిన తరువాత గిరిజనేతరుల అర్జీలపై నిర్ణయం తీసుకోనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version