తెలంగాణ పోలీసులు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లపై కేసులు పెడుతూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని.. మీకెందుకు రాజకీయాలు? మీరు మీ డ్యూటీ మాత్రమే చేయాలని .. రాజకీయాలు చేయరాదని మాజీ సీఎం కేసీఆర్ వరంగల్ సభలో పోలీసులు, ఉన్నతాధికారులను ఉద్దేశించి హెచ్చరిక చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ప్రజలు, పోలీసుల గ్రూపుల్లో వైరల్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు అంతర్మథనంలో ఉన్నట్లు సమాచారం. ప్రజల వాట్సాప్ స్టేటస్‌లలోనూ కేసీఆర్ మాటలు మారుమోగుతున్నాయి.ఈ క్రమంలోనే కేసీఆర్ వార్నింగ్‌తో పోలీసులు ఆలోచనలో పడ్డట్లు చర్చ జరుగుతున్నది. మనకెందుకు.. మన డ్యూటీ మనం చేద్దామనే భావనలో వారు ఉన్నట్లు తెలిసింది. ఏకపక్షంగా ఉంటే భవిష్యత్ కు ప్రమాదమనే ఆందోళన వారిలో కలిగినట్లు సమాచారం.ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నదని.. ఏదైనా చట్టపరంగానే చేద్దామంటూ పోలీసుల్లో చర్చ జరుగుతున్నట్లు టాక్.