తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలో మళ్లీ చిరుత పులి సంచారం మొదలైంది. రాత్రి 11 గంటలకు ఇండ్ల మధ్య నుంచి చిరుత నడుచుకుంటూ వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.విషయం తెలియడంతో ప్రజలు రాత్రిళ్లు బయటకు రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు.
ఈనెల 22వ తేదీ నుంచి రాత్రి వరకు మూడుసార్లు చిరుత సంచరించినట్లు సమాచారం. గ్రామంలోని మాజీ ఉపసర్పంచ్ ప్రసాద్ ఇంటి ముందే మూడు సార్లు చిరుత సంచరించినట్లు ఫుటేజీ ద్వారా తెలిసింది. చిరుత సంచారంతో రాత్రిళ్లు గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఫారెస్టు అధికారులు వెంటనే స్పందించి బోను ఏర్పాటుచేసి చిరుతను బంధించాలని దోమల పెంట ప్రజలు కోరుతున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా :
దోమలపెంటలో మళ్లీ చిరుత పులి సంచారం
రాత్రి 11 గంటలకు ఇండ్ల మధ్య నడుచుకుంటూ వెళ్లిన చిరుత
భయాందోళనలో గ్రామస్తులు
ఈనెల 22వ తేదీ నుంచి రాత్రి వరకు మూడుసార్లు సంచరించిన చిరుత
చిరుత సంచరించిన వీడియోలు సిసి కెమెరాలలో రికార్డ్
మాజీ ఉపసర్పంచ్ ప్రసాద్ ఇంటి… pic.twitter.com/JKvTH6n6ee
— Telangana Awaaz (@telanganaawaaz) May 1, 2025