కోడెల కుమారుడి విచారణతో ఆ సీక్రెట్ బయటపడుతుందా..?  

-

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు విచారణ మెల్లగా పుంజుకుంటోందిఇప్పటికే కోడెల ఆత్మహత్య చేసుకున్న గది ఆమూలాగ్రం పరిశీలించి పరిశోధించిన పోలీసులు.. ఇప్పుడు కాల్ డేటా ఆధారంగా విచారణ ముమ్మరం చేస్తున్నారుకోడెల ఆత్మహత్యకు కుటుంబ కలహాలుకొడుకుతో విబేధాలు కూడా కారణమని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన కుమారుడు కోడెల శివరామ్ ను కూడా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

కోడెల అంత్యక్రియలు బుధవారం ముగిశాయిఅందుకే ఒకటిరెండు రోజుల్లో కోడెల కుమారుడు శివరామకృష్ణను తెలంగాణ పోలీసులు విచారించాలని భావిస్తున్నారుఇప్పటికే కోడెల కుమారుడిని అడగాల్సిన ప్రశ్నల జాబితా రెడీ చేసుకున్నారటమరోవైపు కోడెల ఆత్మహత్యకు కుమారుడే కారణమని ఆయన మేనల్లుడు కుంచేటి సాయిబాబు చేసిన ఫిర్యాదును హైదరాబాద్ పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఆ ఫిర్యాదులోని అంశాలను విచారించాలని కోరుతూ సత్తెనపల్లి పోలీసులు.. బంజారాహిల్స్‌ పోలీసులకు ఫ్యాక్స్‌ ద్వారా కంప్లయింట్ కాపీ పంపారటకోడెల గత నెలలో తనకు పలుమార్లు శివరాం మానసికంగా వేధిస్తున్నారంటూ ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారని సాయి ఇప్పటికే మీడియా ముందు కూడా చెప్పారుఇదే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారటఈ నేపథ్యంలో కోడెల కుమారుడి విచారణలో ఏమైనా వివరాలు దొరుకుతాయేమోనని పోలీసులు భావిస్తున్నారు.

మరోవైపు.. కోడెల కాల్ డేటాను కూడూ పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారుఆయన చనిపోయే ముందు ఎవరెవరికి కాల్ చేశారనే అంశంపై ఫోకస్ పెట్టారుఆయా నెంబర్లకు కాల్ చేసి విచారణ ప్రారంభించారుఆత్మహత్యకు కొద్ది గంటల ముందు కోడెల బసవతారకం ఆసుపత్రికి సంబంధించిన ఓ వ్యక్తితో దాదాపు 20 నిమిషాలు మాట్లాడినట్టు గుర్తించారుఆ వ్యక్తిని కూడా ప్రశ్నిస్తున్నారుకోడెల బలవన్మరణం వెనుక ఇంకా ఏవైనా కారణాలున్నాయామానసికంగా ఎవరైనా వేధించారాఇతర సమస్యలున్నాయా?.. అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version