తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా మాటల యుద్ధం జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బిజేపిలు…టిఆర్‌ఎస్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇటు టిఆర్‌ఎస్ సైతం ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్య కాలంలో అయితే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్‌లు దూకుడుగా కేసిఆర్‌పై ఫైర్ అవుతున్నారు.
ఇక వారికి టిఆర్‌ఎస్ నేతలు కూడా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావు, బండి-రేవంత్‌లని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పీసీసీ, బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కావడానికి కారణం కేసీఆర్ మాత్రమే అని హరీష్ వ్యాఖ్యానించారు. అయితే ఇలా హరీష్ మాట్లాడటంలో లాజిక్ ఏంటో పూర్తిగా అయితే క్లారిటీ లేదు. మామూలుగా ఈ ఇద్దరు నాయకులు, కేసిఆర్‌పై తీవ్రంగా విమర్శలు చేస్తారు.
అయితే అధ్యక్షులు కాకమునుపు కూడా ఈ ఇద్దరు తీవ్ర స్థాయిలో కేసిఆర్‌పై ఫైర్ అయ్యేవారు. రేవంత్ రెడ్డి అయితే దూకుడుగా కేసిఆర్‌పై విరుచుపడేవారు. ఆ దూకుడుతోనే జనాలని బాగా ఆకర్షించేవారు. ఇలా కేసిఆర్‌పై తీవ్రంగా ఫైర్ అవ్వడం వల్లే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్‌కు పిసిసి ఇచ్చిందని పరోక్షంగా హరీష్ చెబుతున్నట్లు తెలుస్తోంది. అటు బండి సంజయ్ కూడా అంతే దూకుడుగా కేసిఆర్‌పై ఫైర్ అవుతారు. అందుకే బండికి కూడా బిజేపి అధ్యక్ష పదవి ఇచ్చిందని చెబుతున్నారని అర్ధమవుతుంది.
అంటే ఈ ఇద్దరు నాయకులు, కేసిఆర్‌ని తిట్టడం వల్లే వారికి అధ్యక్ష పదవులు వచ్చాయని పరోక్షంగా హరీష్ మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. ఇక్కడే ఇంకో లాజిక్ కూడా ఉంది. కేసిఆర్‌కి ఇంతకాలం తర్వాత పోటీ ఇచ్చే నాయకులు కూడా దొరికారనే చెప్పొచ్చు.