మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. మంత్రి మల్లారెడ్డిని అవినీతిని బయట పెడుతున్నానని రేవంత్ రెడ్డి… ఆధారాలతో పాటు మీడియా ముందుకు వచ్చారు. అవినీతి పాల్పడితే కొడుకైనా.. కూతురైన కటకటాల వెనక్కి పోవాల్సి ఉంటుందని చెప్పిన కెసిఆర్… రాజయ్య ను బర్తరఫ్ చేశారని…ఆ తర్వాత ఈటెల రాజేందర్ ను ఫిర్యాదు లు వచ్చాయని తొలగించారని రేవంత్ పేర్కొన్నారు. అంతేకాదు… ఈటల పై విచారణకు కమిటీ వేశారని తెలిపారు.
అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్న కెసిఆర్… మల్లారెడ్డి అవినీతి ఎందుకు మాట్లాడటం లేదని నిప్పులు చెరిగారు. మంత్రులు అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటానని సందేశం పంపించిన కెసిఆర్… మంత్రి మల్లారెడ్డి అక్రమాల పై ఆధారాలు బయట పెడుతున్న… చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 50 ఎకరాల లే అవుట్ చేసిన వ్యాపారిని బెదిరించిన మల్లారెడ్డి… ఆడియో బయటకు వచ్చినా.. కేసీఆర్ స్పందించలేదని మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డి పెద్ద దొంగ అని…ఆయనకు కేసీఆర్ మరియు కేటీఆర్లు వత్తాసు పలుకుతున్నారని నిప్పులు చెరిగారు. మంత్రి మల్లారెడ్డి లాంటి లంగను పక్కన పెట్టుకున్న కేసీఆర్, కేటీఆర్లు పెద్ద లఫంగులని ఫైర్ అయ్యారు.