బండి సంజయ్,మంత్రి హరీష్ రావు మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. సాగర్ ఉపఎన్నిక వేళ వీరి మాటల తూటాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. ఉద్యమ సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న హరీష్ రావుకు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదంటూ సంజయ్ చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పుట్టించాయి.
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తర్వాత బీజేపీపై మంత్రి హరీష్ రావు దూకుడు పెంచారు. దేశభక్తి సరే.. స్వరాష్ట్రంపై మీ భక్తి ఏదీ అంటూ బండి సంజయ్ ను ప్రశ్నించారు అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు హరీశ్. ఈ వ్యాఖ్యలకు సంజయ్ కౌంటరిచ్చారు.
శ్రీకాంతాచారికి దొరికిన అగ్గిపెట్టె..హరీష్ రావుకు దొరకదా అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదనే దానిపై సీబీఐ విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేశారు. హరీష్ అంటేనే అబద్దాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారని విమర్శించారు. దుబ్బాకలో అబద్ధాలు మాట్లాడినందుకే హరీష్ వీపు సాఫ్ అయిందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని కక్కిస్తామన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య ప్రచ్చన్న యుద్ధం నడుస్తోంది. మత్రి హరీశ్,బండి సంజయ్ తమ మాటలతో సాగర్ బైపోల్ వేళ ఒక్కసారిగా వేడి పెంచారు.