తెలంగాణ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే తాజాగా మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతం లో శనివారం అల్పపీడనం ఏర్పడిందని…48 గంటల్లో అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
దాని ప్రభావం తో ఈరోజు రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.